ఎప్పుడు ఎలా ఆడాలో ధోనికి బాగా తెలుసు : భజ్జీ

SMTV Desk 2019-04-16 15:37:13  icc world cup 2019, indian team, bcci, icc, mahendra singh dhoni, dinesh karthik, harbhajan singh

ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీకి తాజాగా బీసీసీఐ భారత జట్టును ప్రకతంచిన సాగతీ తెలిసిందే. ఈ జట్టులో వికెట్ కీపర్ గా మొదటి స్థానంలో మహేంద్ర సింగ్ ధోని ఉండగా రెండో స్థానంలో దినేష్ కార్తీక్ ను ఎంపిక చేశారు. అయితే ఈ ఎంపికపై తాజాగా భారత మాజీ ఆటగాడు, స్పినర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ....ధోనీకి ప్రత్యామ్నాయంగా మరో వికెట్ కీపర్‌ను తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ధోనీకి రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ ప్రత్యామ్నాయం కాలేరన్నారు. ధోని ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని బ్యాటింగ్ స్వేచ్ఛగా చేస్తున్నాడని కొనియాడారు. ధోనికి వెన్నునొప్పి ఉన్నప్పటికి అధిగమిస్తాడని వెనుకేసుకొచ్చాడు. ఎప్పుడు ఎలా ఆడాలో ధోనికి బాగా తెలుసునని చెప్పుకొచ్చారు.