ఇరాన్ ను వణికిస్తున్న వరదలు

SMTV Desk 2019-04-16 15:22:41  iran, iran floods

ఇరాన్: ఇరాన్ దేశానికి వరదల భయం పట్టుకుంది. ఇప్పటికి ఈ దేశంలో వరదల కారణంగా 76 మంది మృత్యువాత పడగా, వందలాది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇరాన్ లోని ఫార్స్, హార్మోజోగన్, సిస్టాన్, బలుచిస్థాన్, ఖోరసాన్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. ఇరాన్ లోని 25 రాష్ట్రాల్లో సంభవించిన వరదలతో వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు కుటుంబాలు నిరాశ్రయులుగా మారారు. రక్షణా సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇరాన్ వరద సహాయ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.