అదిరిపోయే లుక్ తో హళ్ చల్ చేస్తున్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 గ్రే ఎడిషన్

SMTV Desk 2019-04-16 15:17:26  bajaj, bajaj pulsar, pulsar ns 200, pulsar ns 200 gray edition

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 బైక్ ను డీఎస్ డిజైన్ అనే సంస్థ మోడిఫైడ్ వెర్షన్‌ను తాజాగా ఆవిష్కరించింది. అయితే ఈ బైక్ సాధారణ పల్సర్ ఎన్ఎస్200 కంటే మరింత అదిరిపోయే లుక్‌తో మెరుస్తోంది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 గ్రే ఎడిషన్ అనే పేరుతో విడుదల చేసిన ఈ బైక్ కస్టమ్ బ్లూ, గ్రే రంగుల కలయికతో బైక్ ప్రియులను తెగ ఆకర్షిస్తోంది. బైక్ ముందు భాగంలోని హెడ్‌లైట్‌ను ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో అప్‌డేట్ చేశారు. ఫ్యూయెల్ ట్యాంక్ గ్రే కలర్‌లో ఉంటుంది. అయితే ఫ్యూయెల్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్లు మాత్రం బ్లూ రంగులో ఉంటాయి. ఇకపోతే ఎన్ఎస్200 బైక్‌లో 199.5 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ మాగ్జిమమ్ పవర్ 23.5 హెచ్‌పీ@9500 ఆర్‌పీఎం. మాగ్జిమమ్ టార్క్ 18.3 ఎన్ఎం@8000 ఆర్‌పీఎం. బైక్‌లో ఆరు గేర్లు ఉంటాయి. టాప్ స్పీడ్ గంటకు దాదాపు 136 కిలోమీటర్లు. దీని ధర రూ.1.12 లక్షలు. పల్సర్ ఎన్ఎస్200 బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు. ఇది లీటరుకు 35-40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.