ఎన్నికల ప్రచారంలో బాలయ్య డబ్బుల పంపిణీ..!!

SMTV Desk 2017-08-17 13:51:20  Balayya road show, Akhila priya, Money distribution, Election commission

నంద్యాల, ఆగస్ట్ 17 : నంద్యాల ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న వేళ ఒక ఫోటో వైరల్ గా మారింది. బాలయ్య ప్రచారంలో డబ్బులు పంచుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అసలు విషయంలోకి వెళితే.. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ... తన ఓపెన్ టాప్ వాహనంపై భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటు వేయాల౦టూ ప్రచారం చేసారు. అదే వాహనంలో ఉన్న అఖిల ప్రియ మాట్లాతున్న సమయంలో బాలకృష్ణ కొంత మందికి స్వయంగా తనే డబ్బులు ఇస్తున్న ఫోటో ఒకటి వైరల్ అయింది. అంతేకాకుండా ఈ విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా వెళ్లింది. బాలకృష్ణ డబ్బులు పంచారన్న విషయాన్ని ఈసీ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.