ఎంఎల్‌సిలుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం

SMTV Desk 2019-04-16 15:15:28  oath mlc in five members, telangana legislative assembly

హైదరాబాద్: సోమవారం తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో 5గురు సభ్యులు ఎంఎల్‌సిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, రియాజ్ ఉల్ హసన్, యెగ్గే మల్లేశంలు. వీరంతా డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ఛాంబర్ లో ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం చేసిన వారిలో నలుగులు టిఆర్ఎస్, ఒక ఎంఐఎం సభ్యుడు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంఎల్ఏలు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.