ఐసీసీ వరల్డ్ కప్ : ఆసిస్ టీం

SMTV Desk 2019-04-16 14:59:40  icc world cup 2019, australia team, david warner, aron finch, steave smith

ఆస్ట్రేలియా: త్వరలో ప్రారభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీకి ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. గతంలో బాల్ ట్యాపరింగ్‌కు పాల్పడి ఏడాది కాలం పాటు నిషేధానికి గురైన స్టార్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌కు ఏడాది నిషేధం తర్వాత తిరిగి ఆసీస్‌ జట్టులో చోటు దక్కింది. నిషేధం తర్వాత ఇప్పటి వరకు వీరిద్దరూ ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ వారి సామర్థ్యంపై నమ్మకముంచిన ఆసీస్ సెలెక్టర్లు మెగా టోర్నీకి ఎంపిక చేసింది. మొత్తం 15 మంది ఆటగాళ్ల జాబితాను ఆసీస్ ఇవాళ ప్రకటించింది.

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, అలెక్స్ కేరీ, మార్కస్ స్టాయినీస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, జే రిచర్డ్‌సన్, పాట్ కమిన్స్, బెహ్న్రెండార్ఫ్, నాథన్ కౌల్టర్ నైల్, ఆడం జంపా, నాథన్ లైయన్.