బెంగుళూరు బాటలో SRH...ఢిల్లీకి హ్యాట్రిక్

SMTV Desk 2019-04-16 14:52:13  ipl 2019, srh vs dc

ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైసర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ కాపిటల్స్ జట్టు 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ కు ఇది వరుసగా రెబ్దో ఓటమి కాగా ఢిల్లీ హట్రిక్ కొట్టింది. తొలుత ఇన్నింగ్స్ పూర్తి చేసిన ఢిల్లీ జట్టులో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (45: 40 బంతుల్లో 5x4), కొలిన్ మున్రో (40: 24 బంతుల్లో 4x4, 3x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడినా.. శిఖర్ ధావన్ (7), రిషబ్ పంత్ (23: 19 బంతుల్లో 4x4) తేలిపోయారు. దీంతో.. 7 వికెట్ల నష్టానికి 155 పరుగులతోనే ఢిల్లీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లక్ష్య ఛేదనలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో జోడీ 10 ఓవర్లపాటు క్రీజులో నిలిచి తొలి వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. హైదరాబాద్ గెలుపు లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ.. బెయిర్‌స్టో ఔటవగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3), రికీభుయ్ (7), విజయ్ శంకర్ (1), దీపక్ హుడా (3), అభిషేక్ శర్మ (2), రషీద్ ఖాన్ (0), భునవేశ్వర్ కుమార్ (2) , ఖలీల్ అహ్మద్ (0) కాసేపు కూడా క్రీజులో నిలవలేకపోయారు. మధ్యలోనే జట్టు స్కోరు 106 వద్ద డేవిడ్ వార్నర్ కూడా ఔటవడంతో.. మ్యాచ్‌ పూర్తిగా ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిపోయింది.