అభిమానులకు షాక్ ఇచ్చిన సల్మాన్ 'భారత్' ఫస్ట్ లుక్

SMTV Desk 2019-04-16 14:50:56  salman khan, bharat, bharat movie still

ముంభై: సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న కొత్త సినిమా భారత్ . అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఈ స్టిల్ లో సల్మాన్ వృద్ధుడిగా కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు. 24న సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఓ దేశం, వ్యక్తి కలిసి చేసే ప్రయాణమే ఈ భారత్ . ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. సల్మాన్‌ సోదరి పాత్రలో దిశా పటానీ సందడి చేయనున్నారు. రంజాన్‌ సందర్భంగా జూన్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.