'మారుతీ' కార్ల సూపర్ డీల్స్

SMTV Desk 2019-04-16 14:49:52  maruti, maruti suzuki, maruti alto, maruti suzuki super deals

ప్రముఖ వాహన తయారి సంస్థ మారుతీకి చెందిన ఎరీనా చెయిన్ డీలర్‌షిప్స్ తమ కంపెనీ వివిధ రకాల మోడళ్లపై సూపర్ డీల్స్ అందిస్తున్నారు. ఈ ఆఫర్లలో ఎంపిక చేసిన మోడళ్లపై ఏకంగా రూ.70,000 వరకు ప్రయోజనాలు పొందేలా ఉన్నాయి. అయితే ఈ ఆఫరు కేవలం ఏప్రిల్ నెలలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్టు ప్రకటించింది. ఎరీనా డీలర్‌షిప్స్ ప్రస్తుతం మారుతీ సుజుకీ స్విఫ్ట్, డిజైర్, ఆల్టో, ఎర్టిగా, వేగనార్, వితారా బ్రెజా, సెలెరియో వంటి మోడళ్లను విక్రయిస్తున్నాయి. డీజిల్ వేరియంట్‌పై రూ.70,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉండగా పెట్రోల్ వేరియంట్‌పై రూ.35,000 వరకు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.15,000 వరకు ఆదా చేసుకోవచ్చు. సెలెరియో, ఆల్టో, అల్టో కే10 మోడళ్లపై రూ.50,000 వరకు ప్రయోజనాలు పొందొచ్చు అలాగే మారుతీ డిజైర్ కార్లపై రూ.45,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక స్విఫ్ట్ కారు విషయానికి వస్తే డీజిల్ వేరియంట్‌పై రూ.40,000 వరకు, పెట్రోల్ వేరియంట్‌పై రూ.35,000 ప్రయోజనాలు పొందొచ్చు. మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ వితారా బ్రెజా మోడల్‌పై రూ.35,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈకో మోడల్‌పై రూ.15,000 వరకు ప్రయోజనాలు పొందొచ్చు. వేగనార్ గత జనరేషన్ కారుపై రూ.60,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అదే కొత్త జనరేషన్ మోడల్‌పై రూ.20,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. కార్లపై డిస్కౌంట్ ప్రాంతం ప్రాతిపదికన మారుతూ ఉండొచ్చు.