చెన్నైకి మరో విజయం...టాప్ లో CSK

SMTV Desk 2019-04-16 14:40:37  ipl 2019, csk vs KKR

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత ఇన్నింగ్స్ పూర్తి చేసిన కోల్‌కతా 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి చెన్నైకి 162 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. కోల్‌కతా బ్యాట్స్ మెన్ క్రిస్‌లిన్ (82), సునీల్ నరైన్ (2) , నితీశ్ రాణా(21), రాబిన్ ఉతప్ప( 0), ఆండ్రీ రసెల్(10), శుభమన్ గిల్(15), పీయూస్ చావ్లా(4 ), కుల్దీప్ యాదవ్(0), దినేశ్ కార్తీక్(18 ) పరుగులు చేసి 161 పరుగులు చేశారు. లక్ష్య చేధనలో సురేశ్ రైనా (58 నాటౌట్: 42 బంతుల్లో 7x4, 1x6), రవీంద్ర జడేజా (31 నాటౌట్: 17 బంతుల్లో 5x4) చెలరేగడంతో 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ అలవోక విజయాన్ని అందుకుంది. ఛేదనలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు తేలిపోయినా.. ఆఖర్లో సురేశ్ రైనాతో కలిసి బ్యాట్ ఝళిపించిన రవీంద్ర జడేజా.. మరో 2 బంతులు మిగిలి ఉండగానే 162/5తో చెన్నైని గెలిపించాడు. తాజా విజయంతో 14 పాయింట్లకి చేరుకున్న చెన్నై జట్టు పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. కోల్‌కతా 8 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది.