టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

SMTV Desk 2019-04-16 14:39:11  ipl 2019, rcb vs dc

ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా సన్ రైసర్స్ హైదరాబాద్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస ఓటములు చూస్తున్న హైదరాబాద్ కు ఈ మ్యాచ్ పెద్ద సవాలుగా మారింది. ఈ సీజన్లో వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ మూడింటిలో ఓటమి పాలైంది. మూడు మ్యాచుల్లోనే విజయం సాధించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కిందటి మ్యాచ్‌లో బలమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి జోరుమీదుంది. స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కు కేన్ విల్లియం సన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్‌లో డేవిడ్ వార్నర్, బైర్‌స్టో, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. ఢిల్లీలో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. పృథ్వీషా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇంగ్రామ్, క్రిస్ మోరిస్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కిందటి మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ధావన్ ఈసారి కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు.


Sunrisers Hyderabad (Playing XI): David Warner, Jonny Bairstow(w), Kane Williamson(c), Vijay Shankar, Ricky Bhui, Deepak Hooda, Rashid Khan, Abhishek Sharma, Bhuvneshwar Kumar, Sandeep Sharma, K Khaleel Ahmed.

Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Colin Munro, Shreyas Iyer(c), Rishabh Pant(w), Chris Morris, Axar Patel, Amit Mishra, Keemo Paul, Kagiso Rabada, Ishant Sharma.