1400 మంది డాన్సర్లతో కాంచన 3 స్పెషల్ సాంగ్

SMTV Desk 2019-04-16 14:36:29  kanchana 3, muni, raghava Lawrence, muni 4, special song composed by 1400 dancers

ముని సీక్వెన్స్ లో వస్తున్న కాంచన 3 సినిమాకు దర్శకుడు రాఘవ లారెన్స్ ఒక ప్రత్యేకమైన పాటను చిత్రీకరిస్తున్నాడు. దాదాపు 1400 మంది డాన్సర్లతో కోటి ముప్పై లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఈ పాటను చిత్రీకరించడం విశేషం. 1400 డ్యాన్సర్లతో లారెన్స్ మాస్టర్ ఈ పాటను అత్యద్భుతంగా చిత్రీకరించారని సమర్పకుడు బి.మధు వెల్లడించారు. వీరిలో 400 మంది అఘోరా వేషాల్లో, మరో 1000 మంది రకరకాల లుక్స్‌తో ఈ పాటలో కనిపిస్తారని చెప్పారు. ఈ పాటను ఆరు రోజులపాటు చిత్రీకరించామన్నారు. ‘ఈ చిత్రంలో లారెన్స్ నటన విశ్వరూపం చూపించారు. లారెన్స్‌కి ‘కాంచన 3’ చిత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతం లో వచ్చిన చిత్రాల కంటే బలమైన కథ, కథనంతో రూపొందించారు. అలాగే మంచి సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేయనున్నారు. తప్పకుండా ‘కాంచన 3’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అని మధు చెప్పారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయనున్నారు.