వరల్డ్ కప్ కి రిషబ్ పంత్ / దినేశ్ కార్తీక్....?

SMTV Desk 2019-04-16 14:32:11  dinesh karthik, rishab panth, icc world cup 2019, icc, bcci, ipl 2019

మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే వరల్డ్ కప్ టోర్నీకి భారత్ ఇంకా జట్టును ఎంపిక చేయలేదు. అయితే మొదటి మూడు స్థానాలకు ఎంపిక చేసినా నాలుగో స్థానంలో ఎవరు సరిపోతారనే విషయంతో పాటు, రెండో వికెట్ కీపర్‌గా ఎవర్ని తీసుకోవాలనే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సెలక్షన్ కమిటీ ముంబై వేదికగా ఏప్రిల్ 15న మరోసారి సమావేశం కానుంది. రిషబ్ పంత్.. దినేశ్ కార్తీక్ ఇద్దరు వికెట్ కీపర్లే. మహేంద్ర సింగ్ ధోనీ ఉంటే కీపర్ గురించి ఆలోచనే అవసర్లేదు. కానీ, మహీ అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నయం ఉండాలి కదా. అందుకోసం రెండో వికెట్ కీపర్ కోసం చర్చలు జరిపేందుకు సిద్ధమైంది సెలక్షన్ కమిటీ. భారత్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫామ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జట్టు ఎంపిక చేపడుతున్నాం. ఐపీఎల్ ఆడుతున్న వారి ఫిట్‌నెస్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. రెండో కీపర్‌గా పంత్.. కార్తీక్ లలో ఎవర్నో ఒకరినే ఎంచుకోవలసిన పరిస్థితి. నాలుగో స్థానానికి అంబటి రాయుడుతో పాటు విజయ్ శంకర్ కూడా కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఇక ఆల్ రౌండర్ స్థానంలో రవీంద్ర జడేజా.. హార్దిక్ పాండ్యాలు కనిపిస్తున్నారు అని బీసీసీఐ అధికారి మీడియా సమావేశంలో తెలిపారు.