అదిరిపోయే లుక్స్ తో హోండా సీబీఆర్150ఆర్ గ్లోస్ ఆరెంజ్ ఎడిషన్

SMTV Desk 2019-04-16 14:22:35  honda, honda cbr 150e gloss orange edition

హైదరాబాద్, ఏప్రిల్ 14: ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ హోండా నుంచి వచ్చిన బైక్స్ అన్ని దాదాపు యువతను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. కంపెనీ కొత్తగా విడుదల చేసే బైక్స్ అన్ని అదిరిపోయే లుక్స్ తో ఏర్పాటు చేసి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మోడిఫైడ్ హోండా టూవీలర్ బైక్ - ప్రియులను తెగ ఆకర్షిస్తోంది. ఈ మోడిఫైడ్ బైక్ పేరు హోండా సీబీఆర్150ఆర్ గ్లోస్ ఆరెంజ్ ఎడిషన్. స్టీల్త్ ర్యాప్స్ అనే సంస్థ ఈ బైక్‌ను రూపొందించింది. బాడీ ప్యానెల్స్ మీద ప్రీమియం పెయింట్ వేసింది.

దీంతో బైక్ అదిరిపోయే లుక్‌తో కనిపిస్తుంది. బైక్ కన్సోల్ ఆరెంజ్ ఔట్‌లైన్‌తో ఉంటుంది. దీంతో ఈ బైక్ చూసేవారికే కాకుండా రైడర్లకు కూడా అందంగానే కనిపిస్తుంది. ఫ్రంట్ ఫోర్క్స్ గోల్డెన్ షేడ్‌లో ఉంటాయి. హెడ్‌లైట్ ఇప్పుడు ప్రొజెక్టర్ లైట్స్ కలిగి ఉంది. మొత్తంగా మూడు లైట్స్ ఉంటాయి.

ఇకపోతే సీబీఆర్150ఆర్ బైక్‌లో 149 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఆరు గేర్లు ఉంటాయి. బైక్ మాగ్జిమమ్ పవర్ 18.28 హెచ్‌పీ, మాగ్జిమమ్ టార్క్ 12.66 ఎన్ఎం. యమహా ఆర్15 వీ3 బైక్ రాకముందు వరకు భారత్‌లో 150సీసీ విభాగంలో ఇదే పవర్‌ఫుల్ బైక్. సీబీఆర్ 150ఆర్ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.24 లక్షలు. హోండా ఈ సీబీఆర్150ఆర్‌ విక్రయాలను ఎప్పుడో నిలిపివేసింది.