ఏసీ హెల్మెట్...ఇక వేడికి చెక్

SMTV Desk 2019-04-16 14:16:09  Air Conditioned Helmet in Gun Metal, ac helmet

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ అనేక నూతన పరికరాలను ప్రవేశపెడుతుంది. అందులో భాగంగానే వేసవి కాలంలో బైక్ వెళ్ళే వారు ఎండ బారి ఉంది తప్పించుకునేందుకు ఏసీ హెల్మెట్ అందుబాటులోకి వచ్చింది. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్ అనే ఒక చిన్న పరికరం ద్వారా సాధారణ హెల్మెట్‌ను ఏసీ హెల్మెట్‌లా మార్చుకోవచ్చు. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్‌ను హెల్మెట్‌కు తగిలించుకుంటే ఏసీ హెల్మెట్ అవుతుంది. అవసరం లేదనుకుంటే తీసేయవచ్చు. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్.. హెల్మెట్ లోపలి గాలిని చల్లగా ఉంచుతుంది. దుమ్ము కూడా లోనికి రానివ్వదు. హెల్మెట్ కూలర్‌లో లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని యూఎస్‌బీ కేబుల్‌తో చార్జ్ చేసుకోవచ్చు. అలాగే హెల్మెట్‌లో చిన్న వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. అంటే ఏసీ ఎలా పనిచేస్తుందో.. అలాగే ఇది కూడా పనిచేస్తుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్ ముందు భాగంలో కిందివైపు ఈ పరికరాన్ని అమర్చుకోవలసి ఉంటుంది. ఇందులోని ఫ్యాన్ గాలిని వాటర్ ఫిల్టర్ గుండా లోనికి పంపిస్తుంది. ఫిల్టర్ ఎక్కువసేపు తేమను అలాగే పట్టిఉంచుకోగలదు. అందువల్ల రైడ్‌కు బయలుదేనిర ప్రతిసారి రిజర్వాయర్‌ను నీటితో పింపుకోవలసిన అవసరం లేదు. వేగ హెల్మెట్ డీలర్‌షిప్స్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ బ్లూస్నాప్ హెల్మెట్‌ కూలర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.2,299.