ఈవీఎంలపై నమ్మకం లేదు!

SMTV Desk 2019-04-16 10:11:44  delhi chief minister, lok sabha elections, kejriwal, bjp, evm machines, election commission of india

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి ఈవీఎంల గురించి మాట్లాడారు. దేశ ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం లేదని అన్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఈవీఎంల పనితీరుపై విపక్ష పార్టీలు నిర్వహించిన సమావేశానికి అరవింద్‌ కేజ్రీవాల్ హాజరయ్యారు. అన్ని పార్టీలు ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదనే చెబుతున్నాయని, ప్రజలు కూడా వాటిని నమ్మటం లేదని చెప్పారు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించలేకపోతే, కనీసం వీవీ ప్యాట్ లు లెక్కించి గెలుపును ఖరారు చేయాలని కేజ్రీవాల్‌ డిమాండ్ చేశారు.