సెకండ్‌హ్యాండ్ కార్లకు ఫుల్ డిమాండ్

SMTV Desk 2019-04-15 10:58:51  secondhand vehicles, secondhand cars, mahindra, honda, suzuki, nissan, toyato, tata

ఈ మధ్య కాలంలో సెకండ్‌హ్యాండ్ కార్లకు గిరాకి బాగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో కేవలం 2.7 శాతం పెరుగుదల మాత్రమే కనిపించింది. అదేసమయంలో కొత్త కార్ల అమ్మకాలతో పోలిస్తే సెకండ్‌హ్యాండ్ కార్ల అమ్మకాల్లో ఏకంగా 4 రెట్లు పెరుగుదల నమోదైంది. అంటే పాత కార్లకు భలే డిమాండ్ ఉంది. మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్, డ్రూమ్, ఓఎల్ఎక్స్ వంటి ఆర్గనైజ్‌డ్ యూజ్‌డ్ కార్ల విక్రయ సంస్థలు సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్ పెరుగుదలకు పలు కారణాలను పేర్కొంటున్నాయి. వీటిలో మొదటిది ఫైనాన్స్. కొత్త కార్ల కొనుగోలు మాదిరి సెకండ్‌హ్యాండ్ కార్లకు ఫైనాన్స్‌తో అవసరం లేదు. వీటి ధర అందుబాటులోనే ఉంటుంది. అలాగే సెకండ్‌హ్యాండ్ కార్లు మంచి విలువకు లభిస్తున్నాయి. మరోవైపు కొత్త కార్ల ధరలు పెరుగున్నాయి. క్యూ4లో సెకండ్‌హ్యాండ్ ప్యాసింజర్ వాహన విక్రయాలు 10-12 శాతం శ్రేణిలో పెరిగాయని మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ సీఈవో అశుతోష్ పాండే తెలిపారు. మార్కెట్‌లో ద్రవ్య లభ్యత తక్కువగా ఉందని, కొత్త కార్లు కొనేందుకు ఎక్కువ మొత్తం అవసరమని, అందుకే చాలా మంది సెకండ్‌హ్యాండ్ కార్లకు ప్రాధాన్యమిస్తున్నారని వివరించారు.రూ.5 లక్షలు పెడితే కొత్త ఆల్టో, శాంట్రో కార్లు వస్తాయనుకుంటే.. అదే రూ.5 లక్షలకు సెకండ్‌హ్యాండ్ మార్కెట్‌లో హోండా సిటీ వస్తోందని పాండే తెలిపారు. టైర్2, టైర్3 పట్టణాల్లో సెకండ్‌హ్యాండ్ కార్లకు డిమాండ్ ఉందని పేర్కొన్నారు. పాత కారు, కొత్త కారు మధ్య ధర విషయంలో చాలా వ్యత్యాసం ఉటుందని డ్రూమ్ సీఈవో తెలిపారు. తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి సెకండ్‌హ్యాండ్ కార్లు మంచిదని అభిప్రాయపడ్డారు.