కులాంతర వివాహానికి దారుణ శిక్ష

SMTV Desk 2019-04-15 10:57:38  Devigarh village, Jhabua district, madhyapradesh, inter caste marriage

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి వేరే కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందని తనకి గ్రామ పెద్దలు విచిత్ర శిక్ష విధించారు. పూర్తి వివరాల ప్రకారం....మధ్యప్రదేశ్‌ ఝబువా జిల్లాలోని దేవిగఢ్‌ గ్రామానికి చెందిన ఓ యువతి వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే యువతి ప్రేమ పెళ్లిపై గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి వెంటనే శిక్ష అమలు చేశారు. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు శిక్షగా భర్తను భుజంపై మోసుకుని ఆమె ఇంటి నుంచి 35 కిలోమీటర్ల దూరం నడవాలని ఆదేశించారు. దీంతో యువతి చేసేది ఏమి లేక భర్తను తన భుజాలపై కూర్చోబెట్టుకుని నడవడం ప్రారంభించింది. భర్తను ఎత్తుకుని యువతి నడుస్తుంటే కొందరు వీడియోలు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులకు సంఘటనా స్థలానికి చేరకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.