భారత బాక్సరు మీనా కుమారికి స్వర్ణం

SMTV Desk 2019-04-15 10:54:58  Cologne World Cup boxing, Meena Kumari clinches gold as Indian pugilists finish with five medals

శనివారం జరిగిన మహిళల 54కిలోల బౌట్ ఫైనల్లో భారత బాక్సరు మీనా కుమారి (54 కేజీలు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఈ టోర్నిలో భారత్‌ మొత్తం 5 (1స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలు సాధించింది. అయితే మహిళల 54కిలోల బౌట్ ఫైనల్లో మచాయ్‌ బున్‌యానట్‌ (థాయ్‌లాండ్‌)పై మీనా గెలిచింది. హోరాహోరీగా సాగినా.. చివరకు పాయింట్ల ఆధారంగా మీనా విజేతగా నిలిచింది. ఆసియా చాంపియన్‌షిప్ (2014) కాంస్య విజేతగా నిలిచిన మీనా.. తాజాగా జరిగిన స్ట్రాంజా కప్‌లోనూ స్వర్ణ పతకం సాధించింది. ఇక ఈ టోర్నీలో ఇప్పటికే సాక్షి (57 కేజీలు), బసుమతరి (64 కేజీలు) రజత పతకాలు సాధించగా.. పింకీ రాణి (51 కేజీలు), పర్వీన్‌ (60 కేజీలు) కాంస్యాలు దక్కించుకున్నారు. మాచై బంయనుట్‌పై మీనా కుమారి విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది.