ఏపీలో రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్

SMTV Desk 2019-04-15 10:47:20  ap elections, ap assembly elections, ap loksabha elections, election commission, ap elections repolling

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పలు పోలింగ్ బూత్‌లలో దాడులకు దిగాయి. అధికార టీడీపీ.. ప్రతిపక్ష వైసీపీల మధ్య చెలరేగిన ఘర్షణ పోలింగ్‌పై ప్రభావం చూపడంతో ఎన్నికల సంఘం రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు సిద్ధమైంది. గుంటూరు జిల్లాలోని రెండు చోట్ల రీపోలింగ్‌కు పిలుపునిచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ పోలింగ్ బూత్‌తో పాటు నరసారావుపేటలోని 94వ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. గుంటూరు కలెక్టర్ నివేదిక ఆధారంగా ఈ రీపోలింగ్‌కు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.