నేపాల్‌లో కుప్పకూలిన విమానం

SMTV Desk 2019-04-15 10:43:46  2 killed, 5 injured after aircraft collides with chopper in Nepal,

నేపాల్‌: నేపాల్‌లో లుక్లాలోని తెన్‌జింగ్‌ హిల్లరీ విమానాశ్రయంలో ఓ విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. పూర్తి వివరాల ప్రకారం...సమ్మిట్‌ ఎయిర్‌కు చెందిన ఓ విమానం టేకాఫ్‌ అవుతుండగా హెలిప్యాడ్‌లో నిలిపి ఉంచిన హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కాగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద అనంతరం అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.