శ్రీరామ శోభాయాత్ర...నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

SMTV Desk 2019-04-15 10:35:47  sriramanavami

హైదరాబాద్: శ్రీరామా నవమి సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లోని కొన్ని చోట్ల శోభయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే శోభాయాత్ర సీతారాంబాగ్ దేవాలయం, హనుమాన్ వ్యాయామశాల స్కూల్, సుల్తాన్ బజార్, బోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ పీఎస్ రోడ్డు, జాలీ హనుమాన్, ధూల్‌పేట్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, చుడీ బజార్, బేగంబజార్, బర్తన్ బజార్, సిద్ధిఅంబర్ బజార్, శంకర్‌షేర్ హోటల్, గౌలిగూడ చమన్, గురుద్వారా, ఫుత్లీబౌలీ క్రాస్ రోడ్డు, కోఠి , సుల్తాన్ బజార్ మీదు సాగనుంది. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
* పురానాపూల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వాహనాలు పురానాపూల్ బ్రిడ్జి మీద నుంచి ప్లేట్ల బుర్జు లేదా కార్వాన్, కుల్సుంపురా రూట్లలో మళ్లింపు.
* ఎంజే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలు సిటీ కాలేజీ, అఫ్జల్‌గంజ్ వైపునకు మళ్లింపు.
* ఆసిఫ్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు మల్లేపల్లి క్రాస్ రోడ్డు నుంచి విజయనగర్ కాలనీ, మోహిదీపట్నం వైపు మళ్లింపు.
* బోయిగూడ కమాన్ నుంచి సీతారాంబాగ్ వైపు వెళ్లే వాహనాలు ఆఘాపురా, హబీబ్‌నగర్ వైపు మళ్లింపు.* ఆఘాపురా, హబీబ్‌నగర్‌ నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే వాహనాలు దారుసలాం వైపు మళ్లింపు.
* రంగ్‌మహాల్, కోఠి నుంచి గౌలిగూడ చమాన్ వైపు వెళ్లే వాహనాలు జాంబాగ్, ఎంజే మార్కెట్ వైపు మళ్లింపు.* అఫ్జల్ గంజ్ నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలు మదీన, సిటీ కాలేజ్ వైపు మళ్లింపు.
* మాలకుంట నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వచ్చే వాహనాలు అలస్క నుంచి దారుసలాం వైపు మళ్లింపు.
* అఫ్జల్‌గంజ్ నుంచి సిద్ధిఅంబర్‌బజార్ మార్గంలో వచ్చేవాహనాలు నేషనల్ లాడ్జి వద్ద సాలార్జింగ్ బ్రిడ్జి మీదకు మళ్లింపు.