సింధు ఓటమి...సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్ పోరాటం ముగింపు

SMTV Desk 2019-04-15 10:32:19  pv sindhu, Singapore Open 2019, PV Sindhu VS Nozomi Okuhara, Saina Nehwal

సింగపూర్‌: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ఓటమి పాలయింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో నాలుగో సీడ్ సింధు 7-21, 11-21తో ప్రపంచ మాజీ చాంపియన్, రెండో సీడ్ నజోమి ఒకుహర (జపాన్) చేతిలో ఓడింది. సింధు ఈ మ్యాచ్‌లో కనీస పోరాటం చేయకుండానే చేతులెత్తేసింది. మ్యాచ్ మొదటి సింధుపై ఆధిపత్యం చెలాయించిన ఒకుహర 37 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది. సింధు ఓటమితో ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. ఒకుహరతో తలపడ్డ గత రెండు మ్యాచ్‌ల్లో సింధు విజయం సాధించినా.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఓటమిని చవిచూసింది. క్వార్టర్ ఫైనల్లో మరో షట్లర్ సైనా నెహ్వాల్‌ను చిత్తుచేసిన ఒకుహర.. సింధుపై గెలిచి ఫైనల్ చేరింది. తుదిపోరులో వరల్డ్ నంబర్‌వన్ తై జుయింగ్ (చైనీస్ తైపీ)తో ఒకుహర తలపడనుంది.