పంజాబ్ vs బెంగుళూరు : బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ

SMTV Desk 2019-04-14 12:09:24  ipl 2019, rcb vs kxip

ఐపీఎల్ 2019 సీజన్‌లో నేడు మొహాలి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగుళూరు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. నేడు జరిగే మ్యాచ్ చావోరేవో మ్యాచ్ కావడంతో.. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే వరుసగా ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కోహ్లీసేన నేడు విజయ భేరిని మోగించి ప్లే ఆఫ్స్ కి వెళ్తుందో లేక ఇంటి బాట పడుతుందో చూడాలి. ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ తడబడుతూ వస్తోంది. మధ్యలో ఓ రెండు మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి, డివిలియర్స్, పార్థీవ్ పటేల్ మెరిసినా.. మిగిలిన వారి నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదు. ఇక బౌలింగ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనే తరహాలో.. ఆ జట్టు బౌలర్లు ప్రదర్శన ఉంది. చాహల్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నా.. ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, నవదీప్ షైనీ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు. ఇక పంజాబ్ జట్టు ఈ సీజన్లో 7 మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో గెలుపొంది 3 మ్యాచ్ లను చేజార్చుకుంది. పంజాబ్ 8 పాయింట్లతో -0.057 రన్ రేట్ వద్ద ఉంది.

Kings XI Punjab (Playing XI): Lokesh Rahul, Chris Gayle, Mayank Agarwal, Sarfaraz Khan, Nicholas Pooran(w), Mandeep Singh, Sam Curran, Ravichandran Ashwin(c), Andrew Tye, Mohammed Shami, Murugan Ashwin.

Royal Challengers Bangalore (Playing XI): Parthiv Patel(w), Virat Kohli(c), AB de Villiers, Marcus Stoinis, Moeen Ali, Akshdeep Nath, Pawan Negi, Umesh Yadav, Yuzvendra Chahal, Navdeep Saini, Mohammed Siraj.