ముంభైపై ఘన విజయం సాధించిన రాజస్తాన్

SMTV Desk 2019-04-14 12:08:31  IPL 2019, MI VS RR

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు ముంభై లోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంభై ఇండియన్స్ ఫై రాజస్తాన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఇన్నింగ్స్ పూర్తీ చేసిన ముంభై ఐదు వికెట్ల నష్టానికి 187పరుగులు చేసి రాజస్తాన్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (47), క్వింటాక్‌ డికాక్‌(81), సూర్యకుమార్‌(16), పోలార్డ్‌(6), హార్ధిక్‌ పాండ్యా(28), ఇషాన్‌ కిషన్‌(5) పరుగులు చేశారు. జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు, ఉనద్కర్‌ ఒక వికెట్‌, కుల్‌కర్ణి ఒక వికెట్‌ తీశారు. ముంబై ఇండియన్స్‌ చెలరేగి ఆడి రాజస్థాన్‌ ముందు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించాడు. ఇక లక్ష్య చేధనలో RR కూడా చెలరేగిపోయింది. జోస్ బట్లర్ (89), రహనే (37), సంజు సంసన్ (31), స్మిత్ (12), రాహుల్ త్రిపాటి (1), లివింగ్ స్టోన్ (1), శ్రేయాస్ గోపాల్ (13) పరుగులు చేసి ముంభైపై విజయం సాధించారు.