జలియన్ వాలాబాగ్ స్టాంప్స్ ఆవిష్కరణ

SMTV Desk 2019-04-14 12:06:57  jallianwalabhagh, Jallianwala Bagh massacre, allianwala Bagh massacre centenary, rowlatt act, theresa may, theresa, venkaiah naidu, jallianwalabhag stamps

న్యూఢిల్లీ: దేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు నేటితో వందేళ్లు నిండాయి. ఈ క్రమంలో వీరమరణం పొందిన సైనికులకు ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం.. వందరూపాయల నాణేన్ని, జలియన్ వాలాబాగ్ స్మారక స్టాంప్ ను ఆవిష్కరించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది అందరి హృదయాన్ని కలచివేస్తున్న ఘటనగా వెంకయ్య పేర్కొన్నారు. వారి త్యాగాల పునాదులమీదనే మనం స్వేచ్ఛాజీవనం గడుపుతున్నామని సమరయోధులను కొనియాడారు. సందర్శకుల పుస్తకంలో వెంకయ్య నాయుడు తన సందేశాన్ని రాశారు.