రాజన్న ఆలయంలో...రాములవారి పెళ్లి

SMTV Desk 2019-04-14 12:02:00  Vemulawada, Lord shiva temple, Large membars of devotees, sreerama kalyanam, sreeramamavami

సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రత్యేక పుణ్యక్షేత్రంగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణం సందర్భంగా పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 14న రాష్ట్రమంతటా సీతారాముల కళ్యాణం నిర్వహించనుండగా, వేములవాడలో ఒక రోజు ముందే కళ్యాణం వేడుకను నిర్వహించారు. వేములవాడ ఆలయంలో శివుడికి, రాముడికి సమానంగా పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కల్యాణ వేడుకలో ఎంపి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు పాల్గొన్నారు.