‘ఎన్జీకే’ఫస్ట్ సాంగ్ రిలీజ్

SMTV Desk 2019-04-14 11:56:51  ngk, Vaddeelodu Vachene Lyric, Suriya , Yuvan Shankar Raja,

చెన్నై: సూర్య హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘ఎన్జీకే’. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతం చేకూర్చుతున్నారు. ఈ సినిమాలో తొలి పాటను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ‘వడ్డీలోడు వచ్చెనే .. గడ్డి కోసం చూసెనే.. అడ్డమైన మాటలే.. అడ్డే లేక వాగెనే..’ అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా.. సత్యన్‌ గానం చేశారు. ఈ పాట సూర్య అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదల చేసిని ఈ సినిమా టీజర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మే 31న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. సూర్య ప్రస్తుతం ‘కాప్పాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. మోహన్‌లాల్‌, ఆర్య ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.