మోదీ ప్రభుత్వం కోటీశ్వరుల కోసమే...వివాదంలో మోదీ, అనిల్ అంబానీ

SMTV Desk 2019-04-14 11:54:58  anil ambani, narendra modi, central governments, bjp

భారత వ్యాపారవేత్త అనిల్ అంబాని, మోదీ సర్కార్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంలో అంబానీకి అనుచిత లబ్ధి చేకూర్చినట్లు బిజెపి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే అంబానీకి ఫ్రాన్స్ ప్రభుత్వం రూ. 11. 2 కోట్ల పన్ను మాఫీ జరిపిందని ప్రముఖ ఫ్రెంచి దినపత్రిక ‘లే మోంద్’ సంచలన కథనం వెలువరించింది. రఫేల్ ఒప్పందం కుదిరిన తర్వాతే ఈ పన్ను రద్దు నిర్ణయం తీసుకుందని పేర్కొంది. మోదీ ప్రభుత్వం కోటీశ్వరుల కోసమే పనిచేస్తోందని, దేశాల్లోనే కాకుండా విదేశాల్లోనూ అంబానీలకు లబ్ది చేకూరుస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం....అనిల్ అంబానీకి ఫ్రాన్స్‌లో రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ అనే టెలికాం కంపెనీ ఉంది.ఈ కంపెనీ 2007 – 2010 మధ్య కాలంలో 60 మిలియన్ల యూరోల పన్ను ఎగ్గొట్టింది. ఫ్రాన్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో 7.6 మిలియన్ యూరోలు చెల్లించేందుకు కంపెనీ ముందుకొచ్చింది. కానీ ఫ్రాన్స్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో భారత్-ఫ్రాన్స్ మధ్య రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం కుదిరింది. 2015లె ఫ్రాన్స్ పర్యటనలో మోదీ ఈ ఒప్పందాన్ని ప్రకటించారు తర్వాత అంబానీ కంపెనీ పన్ను బాకీ 162.6 మిలియన్ డాలర్లను(రూ. 11.2 కోట్లు) ఫ్రెంచ్ అధికారులు రద్దు చేశారు. కాగా, ఈ ఆరోపణలపై అంబానీ కంపెనీ స్పందిస్తూ.. ఫ్రాన్స్ చట్టాల పరిథిలోనే వివాదాన్ని పరిష్కరించుకున్నామని చెప్పుకొచ్చింది.