నెల రోజుల్లో 10 లక్షల షియోమీ ఫోన్లు విక్రయం

SMTV Desk 2019-04-14 11:48:49  xiaomi mi, red mi, red mi note 7, red mi note 7 pro

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ మరో రికార్డు సృష్టించింది. షియోమీకి చెందిన రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫోన్ల విక్రయాలు భారత్‌లో 10 లక్షల మార్క్‌ను దాటాయని ఆ కంపెనీ వెల్లడించింది. భారత్‌లో ఈ ఫోన్లు లాంచ్ అయిన కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద ఎత్తున ఈ ఫోన్లు అమ్ముడవడం విశేషం కాగా అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ల విక్రయాల సంఖ్య 40 లక్షలు దాటినట్లు షియోమీ తెలిపింది. ఇక చైనాలో ఈ ఫోన్లు లాంచ్ అయిన కేవలం 3 వారాల్లోనే విక్రయాల సంఖ్య 10 లక్షలు దాటిందని షియోమీ వెల్లడించింది. కాగా షియోమీకి చెందిన రెడ్‌మీ నోట్ 7 రూ.9,999 ప్రారంభ ధరకు వినియోదారులకు లభిస్తుండగా, రెడ్‌మీ నోట్ 7 ప్రొ రూ.13,999 ప్రారంభ ధరకు లభిస్తున్నది.