రాహుల్ ప్ర‌ధాని కావాల‌ని ఎవ్వరికీ లేదు : మోదీ

SMTV Desk 2019-04-14 11:47:06  indian prime minister, narendramodi, pm modi, rahul gandhi, bjp, congress party, dmk party, stalin

చెన్నై: మ‌హాకూట‌మి నేత‌లంతా ప్ర‌ధాని కావాల‌న్న ఉత్సుక‌తతో ఉన్నార‌ని, అందుకే ఎవ‌రూ రాహుల్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. డిఎంకె నేత స్టాలిన్ ఒక్క‌డే రాహుల్ గాంధీ ప్ర‌ధాన మంత్రి కావాల‌ని కాంక్షిస్తున్నార‌ని మోడీ అన్నారు. త‌మిళ‌నాడులోని తేనిలో ఎన్నిక‌ల స‌భ‌లో ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. మ‌హాకూట‌మి నేత‌ల్లో ఎవ‌రు కూడా రాహుల్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంలేద‌ని మోడీ విమర్శించారు. త‌మిళ‌నాడులో ఎంజిఆర్ గొప్ప పాల‌న చేశార‌ని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అప్పుడు ఆ ప్ర‌భుత్వాన్ని కూల్చింద‌ని మండి పడ్డారు. ఎంజిఆర్‌, జ‌య‌ల‌లిత‌కు నివాళి అర్పిస్తున్న‌ట్టు మోడీ చెప్పారు. ఈ ఇద్ద‌రు గొప్ప నేత‌ల‌ను చూసి భార‌త దేశం గ‌ర్విస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ఇద్ద‌రూ పేద‌ల కోసం ప‌నిచేశార‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచ దేశాల్లో భార‌త్ ప్ర‌గ‌తి వేగంగా దూసుకెళుతుంటే…కాంగ్రెస్‌, డిఎంకె, మ‌హాకూట‌మి మిత్రులు మాత్రం అసంతృప్తితో ఉన్నార‌ని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సేలంలో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న సిఎం ప‌ళ‌నిస్వామి కూడా స్టాలిన్‌ను త‌ప్పుప‌ట్టారు. ప్ర‌తిప‌క్ష నేత‌లెవ్వ‌రూ రాహుల్ ప్ర‌ధాని కావాల‌న్న ఉద్దేశంతో లేర‌న్నారు. కానీ స్టాలిన్ ఒక్క‌రే రాహుల్‌కు మ‌ద్దుత ఇస్తున్నార‌ని ప్రధాని గరం అయ్యారు.