కాల్పుల్లో 27 మంది తాలిబన్లు మృతి

SMTV Desk 2019-04-14 11:34:20  talibans, amry, afghansitan

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లోని షెర్జాద్‌ జిల్లాలో భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 27 మంది తాలిబన్లు మృతి చెందారు. గవర్నర్‌ కార్యాలయం వద్ద తాలిబన్లు శుక్రవారం సాయంత్రం దాడి చేయగా, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని వెల్లడించింది. ఈ ఘటనలో ఉగ్రవాదులు రెండు కారు బాంబులను పేల్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. భద్రతా బలగాలు చేసిన దాడిలో మరో 32 మంది ఉగ్రవాదులకు గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, మరో ఎనిమిది మంది గాయాలపాలైనట్లు ప్రభుత్వం పేర్కొన్నది.