రానున్న మూడు రోజుల్లో వర్షాలు

SMTV Desk 2019-04-14 11:33:03  ts

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడురోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతా వరణశాఖ అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య మహారాష్ట్ర నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు, ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండడం దీనికి కారణం. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యాయి. కామారెడ్డి 42.6, ఆదిలాబాద్ 43.4, కరీంనగర్ 43.7, రాజన్న సిరిసిల్ల 43.2, నిజామాబాద్ 44.3, నిర్మల్ 44.4, మహబూబాబాద్ 42.9, భద్రాచలం 42, హన్మకొండ 40, హైదరాబాద్ 41, ఖమ్మం 40, మహబూబ్‌నగర్ 41, రామగుండంలో 41, మంచిర్యాల 44.4, జగిత్యాల 44.4, కొమురం భీం 43.5, జగిత్యాల 44, పెద్దపల్లి 43.9, జగిత్యాల 43.7, హన్మకొండ 40, మెదక్ 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.