ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ మాజీ సిఎండి అరెస్ట్

SMTV Desk 2019-04-14 11:23:32  Ramesh C Bawa, former chief executive officer (CEO) of IL&FS Financial Services (IFIN)

ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ మాజీ సిఎండి రమేష్‌ భవను సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల భవకు అరెస్టు నుంచి సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది. ఆ రక్షణ గడువు ముగియడంతో పొడిగించేందకు కోర్టు నిరాకరించింది. దీంతో గత అర్ధరాత్రి ఢిల్లీలో భవను అరెస్టు చేశారు. ఇప్పటికే ఎస్‌ఎఫ్‌ఏవో కాకుండా ఈడి ఐఫిన్‌లోని అవకతవకలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అనుబంధ సంస్థల ఛైర్మన్‌ రవి పార్ధసారథి, ఎండీలు హరిశంకరన్‌, భవలపై మనీలాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి.