ఏప్రిల్‌ 23 లోపు తేల్చేయాలి!

SMTV Desk 2019-04-14 11:21:03  jaish e Chief Masood Azhar, pakistan, india, pulwama attack, masood azhar brother mufti abdul rouf azhar arrest, international terrorist, china

వాషింగ్టన్‌: జైషే మహ్మద్‌ ఉగ్రనేత మసూద్‌ అజార్‌ను మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న చైనాకు అమెరికాతో పాటు ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో చైనా తీరుతో విసిగిపోయిన దేశాలు ఈ విషయంలో తమ అభ్యంతరాలను ఏప్రిల్‌ 23 లోపు వివరించాలని తాత్కాలిక గడువు విధించాయి. లేని పక్షంలో తదుపరి చర్యలకు పూనుకుంటామని స్పష్టం చేశారు. ఐరాస భద్రతా మండలిలో తీర్మానాన్ని అధికారికంగా ప్రవేశపెట్టి, సభ్యదేశాల అభిప్రాయాలను కోరి అనంతరం ఓటింగ్‌ నిర్వహించాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా పేర్కోంది. ఆంక్షళ కమిటీలో కోన్ని నిబంధనలను అడ్డం పెట్టుకుని కారణాలను తెలపడానికి నిరాకరిస్తున్న చైనాను ఈ సారి ఎలాగైనా మండలిలో దోషిగా చూపాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై స్పందించడానికి నిరాకరించిన అమెరికా …ఫ్రాన్స్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది.