భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

SMTV Desk 2019-04-14 11:12:02  indian army, terrorists, firings, jammukashmir

శ్రీనగర్: శనివారం ఉదయం కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌లోని గహండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో తారసపడిన ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. హతమైన ఉగ్రవాదులు జైషే సంస్థకు చెందిన వారని పోలీసులు అనుమానిస్తున్నారు.