కోల్‌కతాపై ఢిల్లీకి ఘన విజయం అందించిన గబ్బర్

SMTV Desk 2019-04-14 11:00:33  ipl 2019, dc vs kkr, shikar dhawan

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అలాగే ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తొలిసారి గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత ఇన్నింగ్స్ పూర్తి చేసిన కోల్‌కతా 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ధావన్‌తో పాటు రిషబ్ పంత్ (46: 31 బంతుల్లో 4x4, 2x6) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో.. మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ జట్టు 180/3తో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన శిఖర్ ధావన్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.