కోల్‌కతాపై ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

SMTV Desk 2019-04-14 10:46:09  ipl 2019, dc vs kkr

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్‌లో 6 మ్యాచ్‌లాడిన కోల్‌కతా నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. మూడు విజయాల్ని మాత్రమే అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగుతుండగా.. తాజా సీజన్‌లో ఇప్పటికే ఒకసారి ఈ రెండు జట్లూ తలపడ్డాయి. ఉత్కంఠ ఊపేసిన ఆ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌ ద్వారా ఢిల్లీ గెలిచిన విషయం తెలిసిందే.

Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Rishabh Pant(w), Colin Ingram, Chris Morris, Axar Patel, Rahul Tewatia, Keemo Paul, Kagiso Rabada, Ishant Sharma.

Kolkata Knight Riders (Playing XI): Joe Denly, Robin Uthappa, Nitish Rana, Dinesh Karthik(w/c), Shubman Gill, Andre Russell, Carlos Brathwaite, Piyush Chawla, Kuldeep Yadav, Lockie Ferguson, Prasidh Krishna.