అంచనాలను మించిన ఇన్ఫోసిన్

SMTV Desk 2019-04-12 19:35:55  infosys, it compenys, annual income, market shares

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిన్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలు మించాయి. తాజాగా 2018-19 ఆర్థిక సంవత్సరపు క్యూ4 ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. కంపెనీ నికర లాభం 10.5 శాతం పెరుగుదలతో రూ.4,078 కోట్లకు చేరింది. కాగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో క్యూ4 లాభం రూ.3,690 కోట్లుగా ఉంది. కీలకమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో పెద్ద డీల్స్ గెలుచుకోవడం ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు కంపెనీ ఆదాయం ఈ క్యూ4లో 19.1 శాతం పెరిగింది. రూ.21,539 కోట్లుగా నమోదైంది. 2017-18 ఆర్థిక సంవత్సరపు క్యూ4లో కంపెనీ ఆదాయం రూ.18,083 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం డాలర్ పరంగా చూస్తే 9.1 శాతం, స్థిర కరెన్సీ ప్రాతిపదికన చూస్తే 11.7 శాతం పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలను స్థిర కరెన్సీ ప్రాతిపదికన 7.5-9.5 శాతంగా నిర్ణయించుకుంది. అలాగే కంపెనీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ షేరుకు రూ.10.5 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.