‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ 2’ ట్రైలర్ రిలీజ్

SMTV Desk 2019-04-12 19:31:57  Student of the Year 2 trailer, Tiger Shroff ,Karan Johar

ముంబయి: టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ 2’. ఈ సినిమా ట్రైల‌ర్ ను శుక్రవారం విడుదల చేశారు. టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న అన‌న్య పాండ్యా, తారా సుత‌రియాలు న‌టిస్తున్నారు. క‌ర‌ణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విద్యార్థుల మ‌ధ్య ఉన్న పోటీత‌త్వాన్ని, వారి మ‌ధ్య జ‌రిగే స‌ర‌దాల‌ను ఈ సినిమాలో చూపించనున్నారు. డ్యాన్సింగ్‌, హై ఫ్ల‌యింగ్ స్టంట్స్‌తో టైగ‌ర్ ష్రాఫ్ ఆక‌ట్టుకుంటున్నారు. ఈ ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్’కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.