ఏపీ సీఎంకు ఐవైఆర్ లేఖ

SMTV Desk 2017-08-16 18:41:08  ap cm chendrababu nayudu, ex. chairmen krishnarao, letter.

అమరావతి, ఆగస్ట్ 16 : ఆదాయం లేని ఆలయాల్లో పని చేసే అర్చకులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఆలయ అర్చకుల వేతనాలను తగ్గించడం సరికాదంటూ ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. అర్చకుల వేతనాలను 10 వేల నుంచి రూ. 5వేలకు తగ్గించడం సరికాదని ఆ లేఖలో పేర్కొన్నారు. సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రూ. 250 కోట్లతో ఫండ్ ఏర్పాటయిందని, ఇతర ఆలయాల కంట్రిబ్యూషన్ మొత్తం కలిపితే రూ. 500 కోట్ల ఫండ్ ఉంది. ఆ నిధులతో అర్చకులకు రూ.10వేల జీతం ఇవ్వవచ్చని సూచించారు. చినజీయర్ లాంటి ట్రస్టులు కూడా అర్చకులకు 20వేల వేతనాన్ని ఇస్తున్నాయని తెలిపారు.