రాహుల్ పై చర్యలు తీసుకోవాలని సిఇసిని కలిసిన కేంద్రమంత్రులు

SMTV Desk 2019-04-12 19:26:45  Union defence minister Nirmala Sitharaman, Union minister Mukhtar Abbas Naqvi, senior party leader Bhupendra Yadav, rahul gandhi

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. వారిని కలిసిన వారిలో మంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తర్ అబ్బాస్ నఖ్వీ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రఫేల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును మార్చి ప్రధాని మోడీ దొంగ అన్నట్లు రాహుల్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలను ఎన్నికల నియామవళి ఉల్లంఘన కింద పరిగణించాలని వారు ఇసిని కోరారు. ఈ క్రమంలో రాహుల్ పై చర్యలు తీసుకోవాలని తాము సిఇసిని కోరినట్టు వారు వెల్లడించారు.