హీరో 200 సీసీ బైక్

SMTV Desk 2019-04-12 19:25:58  Hero HX200R, hero

ప్రముఖ ఆటో మొబైల్స్ తయారి సంస్థ హీరో త్వరలో 200 సీసీ విభాగంలో సరికొత్త లుక్‌తో అదిరిపోయే బైక్‌ను లాంచ్ చేసేందుకు సన్నద్ధమౌతోంది. కంపెనీ కొత్తగా మార్కెట్‌లోకి తీసుకురానున్న బైక్ వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. ఈ బైక్ పేరు హెచ్ఎక్స్200ఆర్ అయ్యి ఉండొచ్చు అని సమాచారం. ఫుల్ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్. ఇది బజాజ్ పల్సర్ ఆర్ఎస్200కు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. బైక్ ఎరుపు రంగులో ఉంది. ఇందులో డిస్క్ బ్రేక్, ఆల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెలిస్కోపిక్ ఫోర్క్స్, ఏబీఎస్, అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లున్నాయి. ఇకపోతే బైక్‌లో 200 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 5 గేర్లు ఉండొచ్చు. ఈ బైక్ త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. దీని ధర రూ. లక్షకు సమీపంలో ఉండొచ్చు.