నేపాల్ లో ప‌బ్ జి బ్యాన్

SMTV Desk 2019-04-12 18:34:26  nepal government banned pubg game, online video game, pubg, federal investigation agency, nepal telecommunication authority deputy director sandeep

నేపాల్ : నేపాల్ ప్రభుత్వం ప్రముఖ ఆన్ లైన్ వీడియో గేమ్ ప‌బ్జీని బ్యాన్ చేసింది. గురువారం నుంచి నిషేధం అమ‌లులోకి వ‌చ్చిందని నేపాల్ టెలిక‌మ్యూనికేష‌న్స్ అథారిటీ (ఎన్‌టీఏ) డిప్యూటీ డైరెక్ట‌ర్ సందీప్ అధికారి తెలిపారు. ఆ దేశానికి చెందిన ఫెడ‌ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ నుంచి అందిన విన్నపం మేర‌కు నేపాల్‌ లో ఉన్న అంద‌రు ఇంట‌ర్‌నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు, మొబైల్ ఆప‌రేట‌ర్లు, నెట్‌వ‌ర్క్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ కు ప‌బ్జీ గేమ్ స్ట్రీమింగ్‌ ను బ్లాక్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయ‌న తెలిపారు. ప‌బ్జీ మొబైల్ గేమ్ వ‌ల్ల తమ దేశంలో ఎలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌న‌ప్ప‌టికీ చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల చ‌దువులు, ఇత‌ర కార్య‌క‌లాపాల‌కు ఈ గేమ్ తీవ్రంగా ఆటంకం క‌లిగిస్తున్నద‌ని భావించినందునే ఈ గేమ్‌ను నిషేధించామ‌ని సందీప్ అధికారి తెలిపారు. ముఖ్యంగా పిల్ల‌లు, యువ‌త ఈ గేమ్‌కు బానిస‌ల‌య్యారు. చాలా చోట్ల ఈ గేమ్‌ కారణంగా కొందరు పిల్లలు, యువకులు ప్రాణాల‌ను పోగొట్టుకున్నారు. దీంతో ఈ పబ్జీ గేమ్‌ను ఇప్పటికి కొన్ని దేశాలు నిషధించాయి.