అబ్బాయిని కనాలని లేదు, కాని అమ్మాయిని కంటే....

SMTV Desk 2017-08-16 18:20:12  mumbai, bollywood, twitter, beti bachaavo, heroine divyaanka tripaati

ముంబై, ఆగస్ట్ 16 : నిన్న పాఠశాలలో జరిగిన వేడుకలకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న ఒక బాలికపై అత్యాచార౦ జరిగిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి మహిళల భద్రత విషయంలో తన ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తన ట్విట్టర్ ఖాతాలో "భేటీ బచావో" కార్యక్రమం ఏమైంది? అంటూ ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను ప్రశ్నించింది. "నాకు కుమారుడిని కనాలని లేదు కాని, అమ్మాయిని కనాలంటే మాత్రం చాలా భయంగా ఉంది. ఒకవేళ నన్ను స్వర్గం నుంచి నరకానికి ఎందుకు తీసుకోచ్చావ్" అని మా అమ్మాయి నన్ను అడిగితే... నేనేం సమాధానం చెప్పాలంటూ ఆవేదనను వ్యక్తం చేసారు. అసలు క్రూరమైన నేరాలు చేసే వారిని, అత్యాచారం చేసే వారిని తీవ్రంగా ఎందుకు శిక్షించరు? దేశానికి మహిళలు ముఖ్యం కాదు అనుకునే రాజకీయ పార్టీలకు ఓట్లు వేయడాన్ని ఆపాలి. మేము ఎందుకు మీకు ఓటు వేయాలి? భద్రత ప్రతి మహిళ హక్కు అంటూ చాలా ఘాటుగా ట్విట్ చేశారు.