పాక్ నుంచి బయటపడ్డ 100 మంది భారత జాలర్లు

SMTV Desk 2019-04-12 18:23:48  Pakistan releases 100 Indian fishermen from jail, pakistan, india, indian fishermens

వడోదర: ఏడాదిన్నర కాలం పాక్ లో గడిపిన 100 మంది భారత జాలర్లను పాక్‌ సైన్యం ఈ నెల 8న అట్టారీ – వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యానికి అప్పగించారు. అక్కడ్నుంచి అమృత్‌సర్ మీదుగా వడోదరకు రైలులో జాలర్లను తరలించారు. 17 నెలల క్రితం వడోదరకు చెందిన కొందరు జాలర్లు.. చేపలు పడుతూ అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటి వెళ్లారు. దీంతో పాక్‌ సైన్యం 100మంది జాలర్లను అదుపులోకి తీసుకుని కరాచీ జైలులో నిర్భందించింది. తాజాగా భారత సైన్యం కోరిక మేరకు 360 మంది భారత జాలర్లను విడుదల చేస్తామని పాకిస్థాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వడోదల జాలర్లైన 100మందిని పాక్‌ విడుదల చేసింది. ఇటీవల రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. తమను ఒక గదిలో బంధించారని, వేరే చోటకు వెళ్లేందుకు అనుమతించలేదని ఓ జాలరి పేర్కొన్నాడు.