'భోబిష్యోటర్ భూత్' వివాదం : బెంగాల్ సర్కార్ కు జరిమానా విధించిన సుప్రీం

SMTV Desk 2019-04-12 18:22:44  BhobishyoterBhoot , AnikDatta, supreme court, west bengal government

బెంగుళూరు: ప్రముఖ దర్శకుడు అనిక్ దత్తా దర్శకత్వలో వస్తున్న సినిమా భోబిష్యోటర్ భూత్ . ఈ సినిమా వివాదంలో సుప్రీం కోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి జరిమాన విధించింది. సినిమాను ఆపే శక్తి ప్రభుత్వానికి లేదని.. సినిమా స్ర్కీనింగ్‌ని ఆపినందుకు ప్రభుత్వం రూ. 20 లక్షలు కట్టాలని ఆదేశాల్లో వెల్లడించింది. ఈ డబ్బును సినిమాను నిర్మించిన నిర్మాతలకు, థియేటర్ యజమానులకు ఇవ్వాలని తెలిపింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో చిత్ర దర్శక, నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత సినిమాను ఎందుకు ఆపాలని చూశారో అర్థం కావడం లేదని దర్శకుడు తెలిపారు.