పాకిస్తాన్ లో పేలుడు....16 మంది మృతి

SMTV Desk 2019-04-12 18:19:21  pakistan, balochistan, kwetta bomblast

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలుచిస్థాన్‌ సమీపంలోని క్వెట్టా లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రదేశంలో బాంబు పేలుడు సంభవించి 16 మంది మృతి చెందారు. పేలుడులో మరో 10 మంది గాయపడ్డారు. హజర్‌ గంజి సబ్జీ మండీ ప్రాంతంలో కూరగాయల మార్కెట్‌ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కూరగాయల మార్కెట్‌ లో ఒక్కసారిగా బాంబు పేలడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి చుట్టు పక్కనున్న భవనాలు, కార్యాలయాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. దాటికి పాల్పడిన వారి వివరాలు పాక్‌ ఇంకా వెల్లడించలేదు.