ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ పై ఆంక్షలు

SMTV Desk 2019-04-11 12:05:33  parliament elections, election commission of india, rajath kumar

హైదరాబాద్: ఈ నెల 11న జరిగే పార్లిమెంట్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రసారం చేయడం, ప్రచురించడంపై ఆంక్షలు విధించడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ అన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మే 19 సాయంత్రం 6:30 వరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలున్నాయని రజత్ కుమార్ తెలియజేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ గురించి కాని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించకూడదని సిఈఒ రజత్ కుమారు వెల్లడించారు.