ప్రత్యర్థి బౌలర్ బంతికి పాక్ యువ క్రికెటర్ మృతి

SMTV Desk 2017-08-16 17:14:02  Zubair mohammad, Young cricketer death, Pakistan, Independence day celebrations, T20 match

పాకిస్థాన్, ఆగస్ట్ 16: పాకిస్థాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మార్డన్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో క్వెట్టా బియర్స్ జట్టు తరపున జుబైర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రత్యర్థి బౌలర్ విసిరిన బంతి అతని తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సామాజిక మాధ్యమం ద్వారా తెలిపింది. తాజా సంఘటనతో క్రికెట్ ఆటగాళ్లు తగిన భద్రత జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యం అనేది మరోసారి తెలిసి వచ్చింది. గతంలో ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలో క్రికెటర్ ఫిలిప్ హ్యూస్, ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్ ను ఆడబోయి మరణించిన విషయం తెలిసిందే. జుబైర్ అహ్మద్ కుటుంబానికి పీసీబీ తన ప్రగాఢ సంతాపం తెలిపింది. బ్యాటింగ్ చేసే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది.